చెర్రీతో శ్రీలీల ఫోక్ సాంగ్‌‌‌‌‌‌‌‌

చెర్రీతో  శ్రీలీల ఫోక్ సాంగ్‌‌‌‌‌‌‌‌

తనదైన ఎనర్జిటిక్ యాక్టింగ్‌‌‌‌‌‌‌‌తో వచ్చిన తక్కువ టైమ్‌‌‌‌‌‌‌‌లోనే ఎక్కువ ఫేమ్ తెచ్చుకుంది శ్రీలీల. ఓవైపు హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా వరుస సినిమాలు చేస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్‌‌‌‌‌‌‌‌తోనూ ప్రేక్షకులను అలరిస్తోంది.  ఇప్పటికే ‘పుష్ప2’లో కిస్సిక్ అంటూ కుర్రకారును మెప్పించిన శ్రీలీల.. మరోసారి తనదైన స్పెషల్ డ్యాన్స్ మూమెంట్స్‌‌‌‌‌‌‌‌తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతోంది.  

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన రూపొందిస్తున్న ‘పెద్ది’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌లో శ్రీలీల కనిపించనుంది.  మ్యూజిక్ డైరెక్టర్  ఏఆర్ రెహ‌‌‌‌‌‌‌‌మాన్ ఈ మూవీ కోసం స్పెషల్ ఫోక్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను డిజైన్ చేశారట. ఓ ఫేమస్ జానపద పాటను రీమిక్స్ చేయబోతున్నారని, ఆ పాటను ఫోక్  సింగర్ పెంచల్ దాస్‌‌‌‌‌‌‌‌తో పాడించనున్నారట. అలాగే ఈ సాంగ్‌‌‌‌‌‌‌‌లో శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. త్వరలోనే సాంగ్ చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది.  జాన్వీ కపూర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తుండగా, శివ రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, జ‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌తిబాబు, దివ్యేందు శ‌‌‌‌‌‌‌‌ర్మ  ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణ లో వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో నిర్మిస్తున్నారు.