- కేర్ పీడియాట్రిషన్ విఠల్ కుమార్
హైదరాబాద్ సిటీ, వెలుగు : వేసవి సెలవులు ముగిసి స్కూల్స్ ప్రారంభమయ్యాయని, హాలీడేస్లో గడిపిన లైఫ్స్టైల్ఇప్పుడు మారుతుందని, మరోవైపు వర్షాల వల్ల పిల్లలు వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉందని కేర్ సీనియర్ పీడియాట్రిషన్ డాక్టర్ విఠల్ కుమార్ కేసిరెడ్డి అన్నారు. స్కూల్స్ ప్రారంభమైన కొన్ని వారాల్లో వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు, కడుపు ఇన్ఫెక్షన్లు, డెంగ్యూ వంటి జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు.
నివారణకు పిల్లలను రోజుకు 8 నుంచి10 గంటల నిద్రపోయేలా చూడాలన్నారు. ఇడ్లీ, గుడ్లు, పాలు వంటి పోషకాహారం బ్రేక్ ఫాస్ట్ కింద ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్చేయకుండా చూడాలని పేర్కొన్నారు. పిల్లలకు పూర్తి చేతుల దుస్తులు వేయడం ద్వారా డెంగ్యూను నివారించవచ్చని చెప్పారు.
