గోదావరిఖని, వెలుగు: పార్లమెంట్ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలవడం ఖాయమని ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం అంతర్గాం మండలం పెద్దంపేటలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం ప్రజలు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌ను భారీ మెజార్టీతో గెలిపించారని, అదే విధంగా కాకా మనువడు, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీకృష్ణను కూడా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు మెరుగు కుమార్ గౌడ్, రవీందర్, ఊరేటి మహేశ్, టి.కుమార్, రమేశ్ యాదవ్, మధు, సాయి, పాల్గొన్నారు.