పింఛన్ బిల్లు రద్దు చేయాలి.. సికింద్రాబాద్ రైల్వే నిలయం ఎదుట నిరసన

పింఛన్ బిల్లు రద్దు చేయాలి.. సికింద్రాబాద్ రైల్వే నిలయం ఎదుట నిరసన

పద్మారావునగర్, వెలుగు: దేశవ్యాప్తంగా జాతీయ పెన్షనర్ల సంఘాల సమన్వయ కమిటీ(ఎన్​సీసీపీఏ) పిలుపు మేరకు శుక్రవారం అఖిల భారత రిటైర్డ్‌‌ రైల్వే మెన్స్‌‌ ఫెడరేషన్‌‌ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. సికింద్రబాద్​ రైల్​ నిలయం వద్ద 300 మందికి పైగా రైల్వే రిటైర్డ్​ ఉద్యోగులు నిరసన చేపట్టారు.

 పింఛన్​ బిల్లు రద్దు చేయాలని, 8వ వేతన సంఘం వెంటనే ఏర్పాటు చేయాలని, పెన్షన్‌‌ కమ్యూటేషన్‌‌ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని, 18 నెలల పెండింగ్‌‌ డీఏ విడుదల చేయాలని డిమాండ్‌‌ చేశారు. అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవకు డిమాండ్ల పత్రాన్ని సమర్పించారు. నాయకులు యుగేందర్‌‌, శివకుమార్‌‌, సుధాకరరావు, స్వామి, బాబురావు, పూర్ణారావు తదితరులు పాల్గొన్నారు.