
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు, తన నియోజకవర్గ జనాలకు అందుబాటులో ఉండకుండా కేవలం ప్రగతి భవన్ కు, ఫాంహౌస్ కు మాత్రమే పరిమితమయ్యారని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి విమర్శించారు. ఇటీవల గజ్వేల్ ప్రజలతో జరిగిన మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘మీ ఎమ్మెల్యేనే అయినా నేను మీకు దొరకలేదు..” అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం ఈ మేరకు ట్విట్టర్ లో మురళి స్పందించారు. పరిపాలనకు సంబంధించి మంత్రులకు, అధికారులకు కేసీఆర్ దొరకలేదని, మంచి పరిపాలన ఇవ్వలేదన్నారు. ‘‘మీ పనితీరుతో కోట్ల మంది ప్రజలు, నిరుద్యోగులు, బడి పిల్లలు, ఇండ్లు లేనోళ్లు ఇబ్బందులుపడ్డారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.