ప్రజలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా క్రైసిస్

ప్రజలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా క్రైసిస్

నాగ్ పూర్: దేశంలో నెలకొన్న మెడికల్ క్రైసిస్ కు కరోనా తొలి వేవ్ తర్వాత చూపిన నిర్లక్ష్యమే కారణమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఫస్ట్ వేవ్ అనంతరం అన్ని వర్గాల ప్రజలు నిర్లక్ష్యం వహించారని, దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు. 

'ఫస్ట్ వేవ్ అనంతరం అందరూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డాక్టర్లు హెచ్చరిస్తున్నప్పటికీ పాలనా యంత్రాంగం, ప్రభుత్వం, ప్రజలు గానీ ఎవరూ వారి సూచనలను ఖాతరు చేయలేదు. మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం భయపడాలా? లేదా వైరస్ ను ధైర్యంగా ఎదుర్కోవాలా అనేది నిర్ణయించుకోవాలి. సానుకూల దృక్పథంతో కరోనాను ధీటుగా ఎదుర్కొందాం' అని భగవత్ పిలుపునిచ్చారు.