మంత్రి ఎర్రబెల్లిని నిలదీసిన స్థానికులు

V6 Velugu Posted on Jul 09, 2021

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపయ్య పల్లి పల్లెప్రగతి సభలో మంత్రి ఎర్రబెల్లిపై ప్రశ్నల వర్షం కురిపించారు స్థానికులు. ఎవరికీ రుణమాఫీ జరగలేదని.. ఇండ్లు ఎందుకు కట్టలేదని మంత్రిని నిలదీశారు రాజిరెడ్డి అనే స్థానికుడు. రుణమాఫీ అన్నారు కని ఒక్కరికీ రూపాయి రాలేదని ప్రశ్నించారు. ఇల్లు ఇంకెప్పుడు ఇస్తారని నిలదీసింది ఓ మహిళ. ఇక్కడి నాయకుడే ఇండ్లు కట్టలేదని సమాధానం ఇచ్చారు ఎర్రబెల్లి. రాబోయే రోజుల్లో ఎవరి స్థలాల్లో వాళ్లే ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుందని సర్ది చెప్పారు మంత్రి. 

Tagged Karimnagar, Minister errabelli, Huzurabad, People questione, Pallepragati Sabha

Latest Videos

Subscribe Now

More News