వారసత్వ రాజకీయాలను తిరస్కరిస్తున్న ప్రజలు

వారసత్వ రాజకీయాలను తిరస్కరిస్తున్న ప్రజలు

ఈ నెల 23 న వెలువడిన ఫలితాలతో చాలామంది రాజకీయ నేతలు, వారి వారసులు షాక్ కు గురయ్యారు. కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ప్రధాన పార్టీలకు చెందిన రాజకీయ వారసులను ప్రజలు చిత్తుగా ఓడించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాన్ని కాకుండా దేశానికి తమకు చేరువలో ఉండే, తమకు నమ్మకం కుదిరిన వ్యక్తికే పట్టం కట్టారు. వారసత్వ రాజకీయాలకు ఓటుతో చెక్ పెట్టారు. ప్రముఖుల వారసులంతా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

అందులో కాంగ్రెస్ నేత సోనియాగాంధీ కుమారుడు రాహుల్ గాంధీ,

కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ,

టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్,

రాజస్థాన్ సీఎం అశోక గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్,

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత మాదవరావు సిందియా కొడుకు జ్యోతిరాథిత్య సిందియా,

అస్సాం మాజీ సీఎం తరుణ్ గోగోయ్ కుమారుడు గౌరవ్ గోగోయ్,

మహరాష్ట్ర కాంగ్రెస్ నేత అజిత్ పవార్ కుమారుడు పార్ధ పవార్,

హర్యానా మాజీ సీఎం భూపేంద్ర హూడా కుమారుడు దీపేందర్ సింగ్ హూడా,

ముంబై మాజీ మేయర్ మురళీ దేవడా వారసుడు మిలింద్ దేవడా,

టిఆర్ఎస్ నేత తలసాని  శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్,

తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత.. ఇలా అందరూ ఓడిపోయారు.

ప్రజలంతా ఒక్కటై వారసత్వ రాజకీయాలను దేశవ్యాప్తంగా తిరస్కరించారు.