మధ్యాహ్నమైనా గ్రీవెన్స్‌‌‌‌కు రాని కలెక్టర్‌‌‌‌.. ఇబ్బందులు పడ్డ ప్రజలు

మధ్యాహ్నమైనా గ్రీవెన్స్‌‌‌‌కు రాని కలెక్టర్‌‌‌‌.. ఇబ్బందులు పడ్డ ప్రజలు

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : తమ సమస్యలు కలెక్టర్‌‌‌‌కు చెప్పుకుందామని సోమవారం భూపాలపల్లి కలెక్టరేట్‌‌‌‌కు వచ్చిన ప్రజలు ఆఫీసర్ల తీరుతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆసరా పింఛన్లు ఇప్పించాలంటూ, భూ సమస్యలు పరిష్కరించాలంటూ చాలా మంది రెగ్యులర్‌‌‌‌గా గ్రీవెన్స్‌‌‌‌ నిర్వహించే ఇల్లందు క్లబ్‌‌‌‌ హౌజ్‌‌‌‌కు ఉదయమే చేరుకున్నారు. మధ్యాహ్నం 12.30 దాటినా కలెక్టర్‌‌‌‌ భవేశ్‌‌‌‌మిశ్రా గ్రీవెన్స్‌‌‌‌కు హాజరుకాలేదు. కలెక్టరేట్‌‌‌‌లోని ‘హెచ్‌‌‌‌’ సెక్షన్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జి శ్రీనివాసరావు ఫిర్యాదులు తీసుకుంటారని ఆఫీసర్లు చెప్పినా ప్రజలు నేరుగా కలెక్టర్‌‌‌‌నే కలుస్తామని చెప్పారు. దీంతో గ్రీవెన్స్‌‌‌‌ను కలెక్టరేట్‌‌‌‌కు మార్చామని, అక్కడికి రావాలని ఆఫీసర్లు చెప్పారు. దీంతో అర కిలోమీటర్‌‌‌‌ దూరంలో ఉన్న కలెక్టరేట్‌‌‌‌కు చేరుకునేందుకు వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ ఒకేసారి కలెక్టర్‌‌‌‌ ఛాంబర్‌‌‌‌ వద్దకు చేరుకునే సరికి అక్కడ తోపులాట జరిగింది. మధ్యాహ్నం 1 గంటకు కలెక్టర్‌‌‌‌ రావడంతో గ్రీవెన్స్‌‌‌‌ ప్రారంభించారు.
ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి

జనగామ అర్బన్, వెలుగు : ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలని జనగామ కలెక్టర్‌‌‌‌ సీహెచ్‌‌‌‌. శివలింగయ్య ఆదేశించారు. అడిషనల్‌‌‌‌ కలెక్టర్లు ప్రపుల్‌‌‌‌ దేశాయ్‌‌‌‌, రోహిత్‌‌‌‌సింగ్‌‌‌‌తో కలిసి సోమవారం ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవోలు మురళీకృష్ణ, సుహాసిని, డీఆర్డీవో రాంరెడ్డి, జడ్పీ సీఈవో వసంత, డీపీవో రంగాచారి, సీపీవో ఇస్మాయిల్‌‌‌‌ పాల్గొన్నారు.