పెప్పర్ స్ప్రేతో మహిళ హల్ చల్

పెప్పర్ స్ప్రేతో మహిళ హల్ చల్

వాషింగ్టన్‌ : అమెరికాలోని హార్లెమ్‌ లో ఓ మహిళ పెప్పర్‌ స్ప్రేతో హల్‌ చల్‌ చేసింది. రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను కాలుతో కొట్టింది. ఆమె భర్తపై పెప్పర్‌ స్ప్రే చల్లింది. అలా సిటీలో మరికొందరిపై పెప్పర్‌ స్ప్రేతో దాడి చేసింది. ఏడుగురు దాడికి గురైనట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు అక్కడి పోలీసులు. దాడికి పాల్పడిన మహిళ పేరు థామస్‌ గా గుర్తించినట్లు తెలిపారు హార్లెమ్‌ అధికారులు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అనే విషయంపై విచారణ జరుపుతున్నామన్నారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.