చంద్రబాబుకు పేదలపై ప్రేమ ఇప్పుడొచ్చిందా... పేర్ని నాని

చంద్రబాబుకు పేదలపై ప్రేమ ఇప్పుడొచ్చిందా... పేర్ని నాని

ఏపీలో ఇంటింటికీ పెన్షన్ పంపిణీ రద్దు అంశం రద్దు రాజకీయ దుమారం రేపుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా వాలంటీర్ల ద్వారా పెన్షన్, ఇతర ప్రభుత్వ పథకాల పంపిణీ రద్దు చేయాలంటూ విపక్షాలు చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. పెన్షన్ పంపిణీ కోసం ప్రత్యామ్నాయాలు వాడుకోవాలన్న ఈసీ సూచనతో ప్రభుత్వం సాచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ ప్రారంభించింది. అయితే, చాలా చోట్ల పెన్షన్ పంపిణీలో జాప్యం అవుతుండటంతో వృద్దులు వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఘాటైన విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.

చంద్రబాబుకు పేదల మీద ప్రేమ ఇప్పుడొచ్చిందా అని ప్రశ్నించారు నాని. వృద్దులు, వికలాంగులకు పెన్షన్ అందకుండా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు సచివాలయ సిబ్బందిని వాడుకొమ్మని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాడని, ఒకప్పుడు సచివాలయ ఉద్యోగాలు అసలు ప్రభుత్వ ఉద్యోగాలే కాదన్న చంద్రబాబు ఇప్పుడు పెన్షన్ పంపిణీ కోసం వారిని వాడుకొమ్మని ఎలా చెబుతారని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థ నోరు పారేసుకున్న చంద్రబాబు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను అడ్డుకోవద్దని ఈసీకి లేఖ ఎలా రాస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఎన్నికలకు పసుపు కుంకుమ డబ్బులు పంచుతుంటే తాము అడ్డుకోలేదని, జన్మ భూమి కమిటీల ద్వారా టీడీపీ కార్యకర్తలకు డబ్బులు పంచినా కూడా అడ్డుకోలేదని అన్నారు.