బంపరాఫర్ : తప్పిపోయిన పిల్లిని పట్టిస్తే లక్ష రూపాయలు

బంపరాఫర్ : తప్పిపోయిన పిల్లిని పట్టిస్తే లక్ష రూపాయలు

ఎవరైనా మనుషులు తప్పిపోతే  మనం మిస్పింగ్ కేసు నమోదు చేసి..తప్పిపోయిన వ్యక్తి ఆచూకి తెలిపిన వారికి తగిన బహుమతి ఇస్తామని ప్రకటనలు, గోడలకు, బస్సులకు పోస్టర్లు అంటిస్తుంటాం.. కానీ నోయిడా కు చెందిన జంతు ప్రేమికులు.. పిల్లి పెంపుడు తల్లిదండ్రులు అయిన ఓ జంట.. తమ పిల్లి కనిపించడం లేదని.. కనిపిస్తే సమాచారం ఇవ్వండి అని పోస్టర్లు ప్రింట్ వేయించి మరీ వీధుల్లో అతికించారు. ఎంతో ఇష్టంగా కడుపున పుట్టిన పిల్లలకంటే ఎక్కువగా ప్రేమించాం.. మా పిల్లి మెడ చుట్టూ తెల్లటి హెయిర్ తో చాలా చక్కగా ఉంటుంది.. దాని ఆచూకి తెలిపిన వారికి లక్షల్లో బహుమానం ప్రకటించారు.. దీనికి సంబంధించిన పోస్ట్ ఒకటి Xలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. 

దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని సమీపంలోని నోయిడాలో ఓ జంట అజయ్ కుమార్ దంపతులు తమ పెంపుడు పిల్లి తప్పి పోయిందని..దాని ఆచూకి పట్టుకునేందుకు స్థానికుల సాయం తీసుకునేందుకు పోస్టర్లు అంటించారు. పెంపుడు పిల్లి ఆచూకి తెలిపిన వారికి లక్ష రూపాయలు ఇస్తామన ప్రకటించారు. తప్పి పోయిన పిల్లి పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఒకటిన్నరేళ్ల తమ పిల్లి పర్షియన్ జాతికి చెందినదని..గతేడాది డిసెంబర్ 24 నుంచి కనిపించకుండా పోయిందని.. దాని వయస్సు ఒకటిన్నరేళ్లు.. జింజర్ కలర్.. దాని మెడచుట్టూ తెల్లటి వెంట్రుకలు గుర్తింపు చిహ్నంగా చెప్పారు. X లో షేర్ చేసిన తర్వాత 2వేల 700 మంది ఈ పోస్ట్ ను చూశారు.  

ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్లు.. పిల్లి పెంపుడు తల్లిదండ్రుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. పిల్లి త్వరగా దాని పెట్ పేరెంట్స్ దగ్గరకు చేరుకోవాలని కోరుకున్నారు.. ఇక వారు ప్రకటించిన లక్ష రూపాయల బహుమతి ని ప్రకటించడం పట్లా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకదా పెంపుడు పిల్లికోసం లక్ష రూపాయల బహుమతి ప్రకటించడం అంటే గ్రేట్..