బీఆర్ఎస్​ లీడర్లపై భూకబ్జా కేసు..వైస్​ చైర్​పర్సన్​ భర్తపై నమోదు

బీఆర్ఎస్​ లీడర్లపై భూకబ్జా కేసు..వైస్​ చైర్​పర్సన్​ భర్తపై నమోదు

జీడిమెట్ల, వెలుగు: భూకబ్జాకు ప్రయత్నించిన అధికార పార్టీ తూంకుంట మున్సిపల్ ​చైర్మన్, వైస్​ చైర్ ​పర్సన్ ​భర్తతోపాటు పలువురిపై పేట్​బషీరాబాద్​ పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ ​జిల్లా దేవరయాంజాల్​ సర్వే నంబర్​ 641లో సంగారెడ్డికి చెందిన బగ్లీ వీరశెట్టప్ప అనే వ్యక్తి 10 ఎకరాల 9 గుంటల భూమిని వీరయ్య అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. అనంతరం ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్​ వేసి వాచ్​మెన్​ను పెట్టుకున్నాడు. 

అయితే, తూం కుంట మున్సిపల్​ చైర్మన్​ కారింగుల రాజేశ్వర్​రావు, వైస్ చైర్​ పర్సన్​భర్త పన్నాల వీరారెడ్డి మరో ఐదుగురు ఆ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి కంచెను ధ్వంసం చేశారు. దీంతో స్థలం యజమాని ఫిర్యాదుతో రాజేశ్వర్​రావు, వీరారెడ్డితోపాటు పెండం లక్ష్మీనారాయణ, శంకర్​గౌడ్, అశోక్, శంకర్, యాదగిరిపై పోలీసులు కేసు ఫైల్​ చేసి దర్యాప్తు చేస్తున్నారు.