కరీంనగర్: 20వేల పోస్టులతో పోలీస్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి

కరీంనగర్: 20వేల పోస్టులతో పోలీస్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి

కరీంనగర్ టౌన్, వెలుగు: 20వేల పోస్టులతో పోలీస్‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని శాతావాహన యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం నిరసన తెలిపారు. 5వేల పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు బదులు  20వేల పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్  చేశారు. 

ఎఫ్​బీవో పోస్టుల సంఖ్య పెంచి నియామక ప్రక్రియ ప్రారంభించాలని  కోరారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2లక్షల ఉద్యోగాల భర్తీ హామీ నెరవేర్చడంతోపాటు నిరుద్యోగులకు నష్టం కలిగిస్తున్న జీవో 46 ను రద్దు చేయాలని  డిమాండ్ చేశారు.