
హైదరాబాద్: 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై.. హైకోర్టులో పిటిషన్ వేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క. సీఎల్పీ విలీనంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీసీసీ నేతలు పిటిషన్ వేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ విలీనం జరగలేదని.. దీనిని పరిగణించకుండా… పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని పిటిషన్ లో కోరారు. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమని కోర్టుకు విన్నవించారు.
మంగళవారం నాడు హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకు రానుంది. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పీసీసీ నేతలు చెబుతున్నారు. ఈ సమస్యను జాతీయ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసిందనీ.. త్వరలోనే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.