బెట్టింగ్ అప్పులు తీర్చడం కోసం దొంగగా మారిన పీజీ స్టూడెంట్

 బెట్టింగ్ అప్పులు తీర్చడం కోసం దొంగగా మారిన పీజీ స్టూడెంట్

వరంగల్ అర్బన్: క్రికెట్ బెట్టింగులతో అప్పుల పాలై దొంగలుగా మారిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మేసి కంప్యూటర్స్ చేసిన సునీల్ అనే యువకుడికి ఆన్లైన్లో బెట్టింగ్ అలవాటైంది. బెట్టింగ్ కోసం బాగా అప్పులు చేశాడు. అయితే బెట్టింగ్ లో డబ్బుపోవడంతో.. అప్పులు తీర్చేందుకు మరో యువకుడితో కలిసి దొంగగా మారాడు. యూట్యూబ్ లో చూసి ఇంటి తాళాలు, బీరువాలు ఎలా బ్రేక్ చేయాలో చూసి చోరీలకు పాల్పడేవారు. వీరిద్దరూ 15 ఇళ్లల్లో చోరీ చేసిన బంగారాన్ని మణప్పురం గోల్డ్ లోన్ కంపెనీలో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారు. వీరిద్దరి నుంచి రూ. 42 లక్షల విలువైన 825 గ్రా. బంగారం, 846 గ్రా. వెండి, లాప్ టాప్, బైక్, స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కాగా.. నిబంధనలకు విరుద్ధంగా బంగారం తాకట్టు పెట్టుకోవడం, కొనడం నేరమని సీపీ తరుణ్ జోషి అన్నారు. త్వరలోనే బంగారం తాకట్టు పెట్టుకొనే షాపుల యజమానులతో సమావేశం నిర్వహించి అవగాహాన కల్పిస్తామని ఆయన అన్నారు.