లండన్ లో “ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి”

లండన్ లో “ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి”

అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న సినిమా "ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి”.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం లండన్ జరుగుతంది. ఇందుకు సంబంధించిన లొకేషన్స్ ఫొటోలను సినిమా యూనిట్ షేర్ చేసింది. నాగశౌర్య, మాళవిక నాయర్ నటించిన ‘కళ్యాణ వైభోగమే’ అప్పట్లో విజయం సాధించిందని.. అలాగే ‘నాగశౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందిన 'ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద విజయాలు సాధించాయని నిర్మాతలు తెలిపారు.  ఇప్పుడు వీరి కాంబినేషన్లో “ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి”రావడం సంతోషం అన్నారు. విజయ వంతమైన సినిమాల నాయక, నాయికలు, దర్శకుడు, ప్రతిభ గల సాంకేతిక వర్గంతో ఈ మూవిని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు “ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి” నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతామన్నారు.