రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా

ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టో సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. 2022 ఎన్నికల్లో తాను అధ్యక్ష పదవికి పోటీ చేయనని స్పష్టం చేశారు.

ఫిలిప్పీన్స్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా ఆరేళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకున్న వారు మళ్లీ దేశాధ్యక్ష పదవికి పోటీచేయడానికి అనర్హులు. రోడ్రిగో విధేయుడు.. సెనేటర్ క్రస్టఫర్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేయనున్నారు. 

మరోవైపు రోడ్రిగో తన కుమార్తె సారాకు లైన్ క్లియర్ చేసేందుకే పోటీ నుంచి తప్పుకున్నారని న్యాయ, రాజకీయాల ప్రొఫెసర్ ఆంటోనియో లావినా అన్నారు. ఆయన ఆలోచన మార్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పారు.