హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కాగా, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసును సవాల్ చేస్తూ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హరీష్ రావుపై నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు క్వాష్ చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. సోమవారం (జనవరి 5) ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. దీంతో సుప్రీం కోర్టు తీర్పు ఆసక్తి నెలకొంది.
►ALSO READ | బీఆర్ఎస్ లో హరీశ్ గుంపు తయారు చేస్తుండు: కవిత
