పల్లెకెలె: పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య శనివారం జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ సూపర్–8 తొలి మ్యాచ్ వర్షం ఖాతాలో వెళ్లింది. భారీ వాన కారణంగా ఇరుజట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. ఫలితంగా రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. చిన్న చిన్న చినుకుల మధ్య టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
కానీ చినుకులు కాస్తా భారీ వర్షంగా మారడంతో ఒక్క బంతి కూడా సాధ్యపడలేదు. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో నిర్ణీత టైమ్ వరకు వేచి చూసిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. తాజా ఫలితంతో రాబోయే రెండు మ్యాచ్‌లు పాకిస్తాన్, కివీస్‌కు కీలకంగా మారాయి.
