- 2026–27 వార్షిక ప్రణాళికకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంపు, వన్యప్రాణుల రక్షణే లక్ష్యంగా అటవీ శాఖ కీలక ముందడుగు వేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర కాంపెన్సేటరీ అటవీకరణ నిధి నిర్వహణ, ప్రణాళిక ప్రాధికార సంస్థ (కంపా) వార్షిక ప్రణాళికకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది.
శనివారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారి (పీసీసీఎఫ్ -హెచ్ఎఫ్ఎఫ్) డాక్టర్ సి.సువర్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూ.367.59 కోట్ల వ్యయ అంచనాలకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వచ్చే ఏడాదికి ఆమోదించిన ఈ నిధులను ప్రధానంగా అటవీకరణ, అడవుల రక్షణ, నేల, -తేమ సంరక్షణ పనులకు కేటాయించారు. అంతేకాకుండా వన్యప్రాణుల ఆవాసాలను అభివృద్ధి చేయడంతో సహా ఇతర పనులకు ఈ బడ్జెట్‌ను ఖర్చు చేయనున్నారు.
