సరస్వతిని తల్లిదండ్రులు కచ్చితంగా చూడాలి

సరస్వతిని తల్లిదండ్రులు కచ్చితంగా చూడాలి

వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన  చిత్రం ‘సరస్వతి’.  తన సోదరి పూజా శరత్ కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆమె నిర్మించింది. మార్చి 6న సినిమా విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై తెలుగు రాష్ట్రాల్లో  బన్నీ వాస్ రిలీజ్ చేస్తున్నారు. శనివారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. 

అతిథిగా హాజరైన   డైరెక్టర్ గోపిచంద్ మలినేని  మాట్లాడుతూ ‘వరలక్ష్మి అద్భుతమైన నటి.  ఆర్టిస్ట్‌‌‌‌గా నిరూపించుకున్న ఆమె  ఇప్పుడు డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా కూడా  తన మార్క్ చూపించబోతోంది.  ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన మంచి సినిమా ఇది’ అని టీమ్‌‌‌‌కు  ఆల్ ద బెస్ట్   చెప్పారు.  బన్నీ వాస్ మాట్లాడుతూ ‘వరలక్ష్మి గారు యాక్టర్‌‌‌‌‌‌‌‌గానే  కాకుండా దర్శక నిర్మాతగా ఈ చిత్రాన్ని  రూపొందించారంటే మంచి కంటెంట్ ఉంటుందని నమ్మాను. 

రీసెంట్‌‌‌‌గా సినిమా చూశా.  మంచి స్క్రీన్‌‌‌‌ప్లేతో తీశారు’ అని అన్నారు.  వరలక్ష్మి మాట్లాడుతూ ‘అందరి అభిమానంతో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా వస్తున్నా. అంచనాలకు తగ్గకుండా ఈ కంటెంట్ ఉంటుంది.  ఈ సినిమాను అంతా సపోర్ట్ చేసి ఇండస్ట్రీలో అమ్మాయిల్ని ఇంకా ప్రోత్సహిస్తారు అని కోరుకుంటున్నా’ అని చెప్పారు. ఈ మూవీ విషయంలో తాము హ్యాపీగా ఉన్నామని నిర్మాత పూజా శరత్‌‌‌‌కుమార్ చెప్పారు.