V6 News

ఫోన్ ట్యాపింగ్ కేసు: జూబ్లీహిల్స్ పీఎస్లో లొంగిపోయిన ప్రభాకర్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసు: జూబ్లీహిల్స్ పీఎస్లో లొంగిపోయిన ప్రభాకర్ రావు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్​రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సరెండర్ అయ్యారు. ఆయన కస్టోడియల్ ఇంటరాగేషన్‌‌కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌‌లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఆఫీసర్ ఏసీపీ పి.వెంకటగిరి ముందు లొంగిపోవాలని ప్రభాకర్‌‌‌‌ రావును సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు ఆయన లొంగిపోయారు. కస్టడీ టైమ్‌‌లో ప్రభాకర్ రావును ఫిజికల్‌‌గా టార్చర్ చేయకుండా ఇంటరాగేషన్ చేయాలని సిట్‌‌కు అత్యున్నత ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

అలాగే ఆయనకు మందులు, ఇంటి భోజనానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ ప్రయోజనాలను, అదే సమయంలో విచారణను సమతుల్యం చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. 

అప్పటి వరకు ముందస్తు బెయిల్ కోసం ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌ను హోల్డ్‌‌‌‌‌‌‌‌లో ఉంచుతామని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌పై బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌‌‌‌‌‌‌‌తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేసిన సంగతి తెలిసిందే.