ఫోన్ చోరీ.. అకౌంట్లలోని రూ.6 లక్షలు మాయం.. బోయినపల్లి పీఎస్ లో కేసు నమోదు

ఫోన్ చోరీ.. అకౌంట్లలోని  రూ.6 లక్షలు మాయం.. బోయినపల్లి పీఎస్ లో కేసు నమోదు

పద్మారావునగర్, వెలుగు: ఓ ప్రయాణికుడి ఫోన్​చోరీ చేసిన దుండగుడు అందులోని రెండు బ్యాంక్​అకౌంట్లలో ఉన్న రూ.6 లక్షలను మాయం చేశాడు. బోయిన్​పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ కు చెందిన ప్రసాద్ రావు సోమవారం బోయిన్ పల్లి లో నాందేడ్ కు చెందిన బస్ ఎక్కుతుండగా గుర్తు తెలియని వ్యక్తి అతని సెల్ ఫోన్ ను దొంగిలించాడు. 

తర్వాత ఫోన్​పోయిన విషయం తెలుసుకున్న బాధితుడు బోధన్ లో కొత్త మొబైల్​కొనుగోలు చేశాడు. పాత నంబర్ పైనే సిమ్ కార్డు తీసుకున్నాడు. అయితే ఫోన్​లో కొత్త సిమ్ కార్డు వేయగానే అతని బ్యాంక్​అకౌంట్ల నుంచి డబ్బులు డెబిట్​అయినట్లు మెస్సేజ్​లు వచ్చాయి. దీంతో బాధితుడు మంగళవారం బోయిన్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.6 లక్షలు విత్ డ్రా అయ్యాయని పేర్కొన్నాడు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.