ఫోన్‌‌టీవీ యాప్స్‌‌పై కంట్రోల్​

ఫోన్‌‌టీవీ యాప్స్‌‌పై కంట్రోల్​

న్యూఢిల్లీ: టీవీ చానెళ్లను కూడా ప్రసారం చేసే హాట్‌ స్టా ర్‌ , ఎయిర్‌ టెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీవీ, సోనీ లైవ్‌ వంటి ఓవర్‌ ది టాప్ (ఓటీటీ) అప్లికేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తన పరిధిలోకి తీసుకొచ్చి నియంత్రించాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌ ) కోరుకుంటోంది. టీవీ చానెళ్ల మాదిరే వీటికీ లైసెన్సింగ్‌ నిబంధనలను అమలు చేయాలని భావిస్తుంది. టీవీ చానెళ్ల టారిఫ్‌ ను మరింత తగ్గించడానికి ఇటీవలే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి న ఈ సంస్థ, టీవీ చానెళ్లను ఉచితంగా లేదా నామమాత్రపు చార్జీలతో అందిస్తున్న ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టాలని అనుకుంటోంది.

‘‘లైసెన్సు ఫీజు చెల్లించిన వారికి చానెళ్లను ప్రసారం చేసేందుకు అనుమతి ఉంది. ప్రసార హక్కులను టీవీ చానెళ్ల యాజమాన్యాలు కేబుల్‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్లు లేదా శాటిలైట్ ప్లేయర్లకు అమ్ముకుంటాయి. హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌, సోనీ లైవ్‌‌‌‌‌‌‌‌ వంటి ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌ ఇదే చానెళ్లను క్యారియర్‌‌‌‌‌‌‌‌ చార్జీలు చెల్లించకుండా ప్రసారం చేయడం అభ్యంతరకరం. యాజమాన్యాలతోపాటు ఓటీటీ ప్రొవైడర్లు లైసెన్సు ఫీజు చెల్లించాలి లేదా ఇద్దరికీ మినహాయింపు ఇవ్వాలి’’ అని ట్రాయ్‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌ అధికారి ఒకరు అన్నారు.

మనదేశంలో టీవీ చానెళ్ల బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్టింగ్‌‌‌‌‌‌‌‌ లైసెన్సు పదేళ్లపాటు ఉంటుంది. కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనలకు సంబంధించి ప్రభుత్వం విధించిన అన్ని రూల్స్‌‌‌‌‌‌‌‌నూ చానెళ్లు పాటించాలి. ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌ ఐటీ చట్టంలోని నిబంధనలను పాటిస్తే సరిపోతుంది. వీటికి లైసెన్సింగ్‌‌‌‌‌‌‌‌ విధానం లేదు. ట్రాయ్‌‌‌‌‌‌‌‌ పరిధిలోకి ఓటీటీలను తీసుకురావడాన్ని వాటి యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే విషయాన్ని ట్రాయ్‌‌‌‌‌‌‌‌కు తెలియజేశాయి కూడా. మనదేశంలోని అత్యధిక ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌ను టీవీ చానెళ్ల యాజమాన్యాలే నిర్వహిస్తున్నాయి. జీ, స్టార్‌‌‌‌‌‌‌‌, సోనీ, టైమ్స్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌కు సొంత ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. ఈ విషయమై వీడియో స్ట్రీమింగ్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ ఎంఎక్స్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ సీఈఓ కరణ్‌‌‌‌‌‌‌‌ బేడీ మాట్లాడుతూ టీవీ చానెళ్లను ఇది వరకే ట్రాయ్‌‌‌‌‌‌‌‌ నియంత్రిస్తున్నదని, అవే చానెల్స్‌‌‌‌‌‌‌‌ ఓటీటీల్లో ప్రసారమవుతున్నాయి కాబట్టి వీటిపైనా నియంత్రణ అనవసరమని అభిప్రాయపడ్డారు.

నియంత్రణల వల్ల సృజనాత్మకత దెబ్బతింటుందని ఆక్షేపించారు. ‘‘టెలికం చట్టం ప్రకారం ఓటీటీలను నియంత్రించేందుకు ట్రాయ్‌‌‌‌‌‌‌‌కు అధికారం లేదు. ఓటీటీలు ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌ ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌లో భాగం. ఇవన్నీ ఐటీ చట్టం పరిధిలోకి వస్తాయి. చానెళ్ల మాదిరే మాకూ కాంపిటిషన్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌ వంటి అన్ని చట్టాలు వర్తిస్తాయి’’ అని స్టార్‌‌‌‌‌‌‌‌ ఇండియా ట్రాయ్‌‌‌‌‌‌‌‌కు సమర్పించిన పత్రంలో పేర్కొంది. డీటీహెచ్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు, కేబుల్ ఆపరేటర్లు మాత్రం ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌ లైసెన్సింగ్‌‌‌‌‌‌‌‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని వాదిస్తున్నారు. ఒకే సమయంలో ఒకే షోను అటు చానెల్‌‌‌‌‌‌‌‌లో ఇటు ఓటీటీ యాప్‌‌‌‌‌‌‌‌లో చూపెట్టడం సరికాదని అంటున్నారు. ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌తోపాటు వాట్సప్‌‌‌‌‌‌‌‌, ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌, స్కైప్‌‌‌‌‌‌‌‌ వంటి వాయిస్‌‌‌‌‌‌‌‌ కాలింగ్‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌ను నియంత్రించాలా అనే విషయంలోనూ ట్రాయ్‌‌‌‌‌‌‌‌ సంప్రదింపులు జరిపింది. సిఫార్సులు ఇంకా రాలేదు.

ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌కు పెరగనున్న ఆదరణ

హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌, నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌, అమెజాన్‌‌‌‌‌‌‌‌ ప్రైమ్‌‌‌‌‌‌‌‌ వీడియో, యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ వంటి వీడియో ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌కు భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో మరింత ఆదరణ ఉంటుంది. ఈ మార్కెట్‌‌‌‌‌‌‌‌ మరింత వృద్ధి నమోదు చేయనుంది. 2022 నాటికి ఓటీటీ మార్కెట్‌‌‌‌‌‌‌‌ విలువ రూ.5,363 కోట్లకు చేరుకొని ప్రపంచవ్యాప్తంగా ‘టాప్‌‌‌‌‌‌‌‌ 10’ మార్కెట్లలో ఒకటిగా నిలుస్తుంది. అసోచామ్‌‌‌‌‌‌‌‌–పీడబ్ల్యూసీ ఉమ్మడిగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‘‘విదేశాల్లో ఓటీటీ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో దూసుకెళ్తున్నా, ఇండియాలో ఈ మార్కెట్‌‌‌‌‌‌‌‌ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. 2017–2022 వరకు 22.6 శాతం వరకు సీఏజీఆర్‌‌‌‌‌‌‌‌ నమోదు అవుతున్నందున, మన మార్కెట్‌‌‌‌‌‌‌‌ అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌తో పోటీపడుతుంది. ఈకాలంలో అంతర్జాతీయ వీడియో ఓటీటీ సీఏజీఆర్‌‌‌‌‌‌‌‌ 10.1 శాతమే ఉంటుంది’’ అని ‘వీడియో ఆన్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ : ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ రీఇమాజిన్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌’ పేరుతో విడుదలైన నివేదిక పేర్కొంది. దీని ప్రకారం.. నిరంతరాయ కనెక్టివిటీ, స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్లు ఈ వ్యాపారానికి కీలకంగా మారాయి. నచ్చిన షోను, చానెల్‌‌‌‌‌‌‌‌ను ఇష్టమొచ్చినప్పుడు చూసుకునే వీలుండటం కూడా ఓటీటీ యాప్స్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధికి కారణం. 2017లో స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ యూజర్ల సంఖ్య 46.8 కోట్లు కాగా, 2022 నాటికి ఇది 85.9 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అంటే ఏటా 12.9 శాతం సీఏజీఆర్‌‌‌‌‌‌‌‌ నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. అత్యంత చవక డేటా టారిఫ్‌‌‌‌‌‌‌‌లు, స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్లు పెరగడం వల్ల ఓటీటీ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు ఎంతో మేలు కలుగుతున్నది.