నెంబర్ వన్ ప్లేస్‌లో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే

నెంబర్ వన్ ప్లేస్‌లో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే
  • గూగుల్ పే నుంచి 100 కోట్ల ట్రాన్సాక్షన్లు
  • మూడోస్థానంలో పేటీఎం
  • ప్రకటించిన  పర్కటించిన ఎన్‌సీపీఐ

న్యూఢిల్లీ: యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫేస్ (యూపీఐ) ట్రాన్సాక్షన్లలో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే హవా కొనసాగుతోంది. గత నెల కూడా ఈ ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ సత్తా చాటింది. ఏకంగా 1.40 కోట్ల ట్రాన్సాక్షన్లు ఈ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా జరిగాయి. జూలై నెలలో మొత్తం యూపీఐ ట్రాన్సాక్షన్లలో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే 46 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీపీఐ) డేటా ప్రకారం జూలైలో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్ల మొత్తం విలువ దాదాపు రూ.288,572 కోట్లు.  గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాన్సాక్షన్ల సంఖ్య 1.11 కోట్ల వరకు ఉండగా, వీటి విలువ రూ. 2,30,874 కోట్లకు చేరుకుంది. పేటీఎం మూడోప్లేసులో ఉంది. ఈ కంపెనీ  పేమెంట్స్ బ్యాంక్ యాప్ ద్వారా రూ. 51,694 కోట్ల విలువైన 45.40 కోట్ల ట్రాన్సాక్షన్లు పూర్తయ్యాయి.  గూగుల్ పే  వాల్యూమ్ మార్కెట్ షేర్ 34.45 శాతం,  పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యాప్ వాటా 14 శాతం ఉంది. అంతకుముందు నెలతోపోలిస్తే  ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే ట్రాన్సాక్షన్లు 15 శాతం, గూగుల్ పే ట్రాన్సాక్షన్లు 15 శాతం,  పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ యాప్ ట్రాన్సాక్షన్లు 18 శాతం పెరిగాయి. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీపీఐ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే, గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పేటీఎం వంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల(టీపీఏపీ) మార్కెట్ షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30 శాతంలోపు ఉండాలి. ఇప్పటికే 30 శాతం కంటే ఎక్కువ ఉంటే..రెండేళ్లలోపు తగ్గించుకోవాలి. అయితే జూలైలో యూపీఐ ట్రాన్సాక్షన్లు రికార్డుస్థాయిలో ఏకంగా 324.78 కోట్లు దాటాయి.  ట్రాన్సాక్షన్ల  విలువ రూ. మొదటిసారిగా 6 లక్షల కోట్ల మార్క్ దాటిందని ఎస్​సీపీఐ ప్రకటించింది.