6 కోట్లకు చేరిన స్నాప్‌‌చాట్‌‌ యూజర్లు

6 కోట్లకు చేరిన స్నాప్‌‌చాట్‌‌ యూజర్లు

న్యూఢిల్లీ: ఇండియాలో ఫోటో మెసేజింగ్‌‌ యాప్ స్నాప్‌‌చాట్‌‌ యూజర్ల బేస్  ఆరు కోట్లకు చేరుకుంది.  డైలీ యాక్టివ్ యూజర్లు(డీఏయూ) 150 శాతం పెరిగారని కంపెనీ తెలిపింది. పెరుగుదలను ఇలానే కొనసాగిస్తామని స్నాప్‌‌చాట్‌‌ పేరెంట్‌‌ కంపెనీ స్నాప్ ఎండీ నానా మురుగేశన్‌‌ అన్నారు. గ్లోబల్‌‌గా స్నాప్‌‌చాట్‌‌ డీఏయూ 26.5 కోట్ల మంది ఉన్నారని పేర్కొన్నారు. రోజుకి సగటున 500 కోట్ల స్నాప్‌‌లు క్రియేట్ అవుతున్నాయని చెప్పారు. 2020 తమకు మంచి ఏడాదని మురుగేషన్ అన్నారు. కంపెనీ గ్రోత్ మూమెంటమ్​ను చూసి తామే ఆశ్చర్యపోయామని చెప్పారు. డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో  కంపెనీ యూజర్ల బేస్‌‌ ఇండియాలో 6 కోట్ల మార్క్​ను క్రాస్ చేసిందని అన్నారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్​లో భూములపై పెట్టుబడి రూ.7 వేల కోట్లు

శేఖర్ కమ్ముల ‘నీ చిత్రం చూసి’ సాంగ్ రిలీజ్

25 మందిని కాపాడిన ఫోన్‌ కాల్‌: ధౌలిగంగ ఉప్పొంగుతోంది కొడుకా ఉరుకు

గ్రెటా థన్‌బర్గ్ ‘టూల్ కిట్’కు సాయం.. బెంగళూరు స్టూడెంట్‌ అరెస్ట్‌