అప్పట్లో టాప్ యాంకర్.. ఇప్పుడు వీధి వ్యాపారి..

అప్పట్లో టాప్ యాంకర్.. ఇప్పుడు వీధి వ్యాపారి..

ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్‌లు తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుండి అక్కడి ప్రజల పరిస్ధితులు పూర్తిగా మారిపోయాయి. చాలామంది జీవితాలు తలకిందులయ్యాయి. అందుకు ఉదాహరణ ఈ జర్నలిస్టే. ఇతని కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  ఇతని పేరు మూసా మొహమ్మదీ. తాలిబాన్ల ప్రభుత్వం రాకముందు టాప్ న్యూస్ ఛానల్ లో యాంకర్, జర్నలిస్టుగా పనిచేశాడు. ఇప్పుడు కుటుంబాన్ని పోషించడానికి బయట తినుబండారాలు అమ్ముకుంటున్నాడు.

మూసా మొహమ్మదీ కథ  సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేషనల్ రేడియో, టెలివిజన్ డైరెక్టర్ జనరల్ అహ్మదుల్లా వాసిక్ స్పందించారు. తన డిపార్ట్ మెంట్ లో మొహమ్మదీని నియమిస్తానని ఆయన హామీ ఇచ్చారు.  తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి దేశంలో మానవతా, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత కొన్ని నెలలుగా అనేక మంది జర్నలిస్టులు, ముఖ్యంగా మహిళలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తలసరి ఆదాయం చివరి నాలుగు నెలల్లో మూడింట ఒక వంతుకు పడిపోయిందని ప్రపంచ బ్యాంక్ ఇటీవల పేర్కొంది.