పిక్ టాక్: ఉన్నడా.. పోయిండారా?

పిక్ టాక్: ఉన్నడా.. పోయిండారా?

‘అరేయ్‌‌ బిట్టు .. పోయిండంటవారా? ఏమోరా చింటు .. సుట్టు పక్కలైతే కనవడ్తలేడు. అయినా వాడేందిరా? సంపనింకె అట్ల ఉరికొచ్చిండు. దబ్బదబ్బ ఉరికినం కాబట్టి బతికిపోయినం. లేకపోతే ఇయ్యాల వానికి చికెన్‌ 65 అయ్యే వాళ్లం ’ అన్నట్టు చూస్తు న్న ఈ ఫొటోలోని జంతువులను షుగర్‌ గ్లైడర్స్ అంటారు. ఆస్ట్రేలియాలోని కూమా టౌన్‌ లో ఇవి ఇలా బయటకొచ్చినపుడు ఫొటోగ్రాఫర్‌ చార్లెస్‌ డేవిస్‌ తీశాడీ ఫొటో. ప్రతిరోజు రాత్రి 8, 9 మధ్యలో ​ఇవి వే టకెళ్తాయని, వెళ్లే ముందు బయట పరిస్థితి ఎలా ఉందో చెట్టు బయటికొచ్చి చూస్తాయని డేవిస్‌ చెప్పారు.