హైదరాబాద్: పేరుకుపోతున్న చెత్తకుప్పలు

హైదరాబాద్: పేరుకుపోతున్న  చెత్తకుప్పలు

నగరంలో జీహెచ్​ఎంసీ నిర్లక్ష్యం వల్ల పలుచోట్ల చెత్త పేరుకుపోతోంది. రహదారుల వెంట చెత్తకుప్పలు దారుణ స్థితిలో దర్శనమిస్తున్నాయి. కొన్ని రోజులుగా చెత్త ఎత్తకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని ప్రజలు చెబుతున్నారు. ఓ వైపు వర్షాలతో రోడ్లు చిత్తడిగా మారుతుండగా.. మరోవైపు చెత్తకుప్పలు రోడ్లను కప్పేస్తున్నాయి. అసలే వ్యాధుల సీజన్​ కావడంతో ఈ చెత్తకుప్పల కారణంగా రోగాలు ప్రబలే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే కుప్పలను తొలగించి రోడ్లను క్లీన్​గా ఉంచాలని అధికారులను డిమాండ్​ చేస్తున్నారు. –