హైదరాబాద్ బోయిన్పల్లి మార్కెట్‌‌లో చెత్త గుట్టలు

హైదరాబాద్  బోయిన్పల్లి మార్కెట్‌‌లో చెత్త గుట్టలు
  • దుర్వాసనతో పని చేయలేకపోతున్నామని 
  • వ్యాపారులు, హమాలీల ధర్నా

పద్మారావునగర్, వెలుగు: బోయిన్‌‌పల్లి మార్కెట్‌‌లో పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేదని, చెత్త గుట్టలుగా పేరుకుపోయిందని వ్యాపారులు, హమాలీలు సోమవారం ధర్నాకు దిగారు. నెలల తరబడి చెత్తను తీయకపోవడంతో ప్రాంగణమంతా వ్యర్థాలతో నిండిపోయి, దుర్వాసన వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మార్కెట్ అధికారులు, కమిటీ స్పందించకపోవడంతో సమస్య తీవ్రమవుతోందని, చెత్త పెరిగి దోమలు, ఈగలతో అనారోగ్యం భారిన పడుతున్నామన్నారు. దుర్వాసన తట్టుకోలేక పనులు చేసుకోలేకపోతున్నామన్నారు. దీనికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ బాబు స్పందిస్తూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, బిల్లులు చెల్లించకపోవడం వంటి కారణాలతో చెత్త తొలగింపు పనులు నిలిచిపోయాయన్నారు. గతంలో తన సొంత ఖర్చుతో చెత్త తొలగించించినట్లు చెప్పారు. త్వరలోనే కొత్త కాంట్రాక్టర్‌‌కు బాధ్యతలు అప్పగించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.