Delhi liquor scam : కవిత విచారణకు ముందు ట్విస్ట్.. నా వాంగ్మూలం వెనక్కి తీసుకుంటా : పిళ్లయ్​

Delhi liquor scam : కవిత విచారణకు ముందు ట్విస్ట్.. నా వాంగ్మూలం వెనక్కి తీసుకుంటా : పిళ్లయ్​

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్ .. ఎవరూ ఊహించని విధంగా ఇటీవలే అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లయ్.. యూటర్న్ తీసుకున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఇచ్చిన నా వాంగ్మూలాన్ని ఉప సంహరించుకోవటానికి అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో మార్చి 10వ తేదీ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై ఈడీకి నోటీసులు కూడా జారీ చేసింది కోర్టు. మార్చి 11వ తేదీ.. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరు అయ్యే 24 గంటల ముందు.. పిళ్లయ్ పిటీషన్ దాఖలు చేయటం ఆసక్తిగా మారింది. అసలు పిళ్లయ్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కవితకు నోటీసులు జారీ చేసింది ఈడీ.

విచారణ సందర్భంగా అరుణ్ పిళ్లయ్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే.. కవిత బినామీ అంటూ తన ఛార్జిషీట్ చాలా సార్లు ప్రస్తావించింది ఈడీ. పిళ్లయ్ విచారణ తర్వాతే కవితకు నోటీసులు జారీ చేయటం.. విచారణకు హాజరుకావాలని ఆదేశించటం చకచకా జరిగిపోయాయి. ఇదే సమయంలో తీహార్ జైల్లోనే ఉన్న ఆప్ లీడర్ సిసోడియాను సైతం ఈడీ అరెస్ట్ చేయటం.. కస్టడీలోకి తీసుకుని విచారిస్తారనే వార్తలు వస్తున్న క్రమంలో.. పిళ్లయ్ తన వాంగ్మూలం వెనక్కి తీసుకుంటాను అంటూ పిటీషన్ దాఖలు చేయటం ఊహించని పరిణామంగా కనిపిస్తోంది. 

ఒక్కసారి ఇచ్చిన వాంగ్మూలం ఉపసంహరించుకోవటం సాధ్యం అవుతుందా.. ఇలాంటి ఆప్షన్ ఒకటి ఉందా అని సామాన్యుల్లో చర్చ జరుగుతుంది. వాంగ్మూలం ఉపసంహరించుకోవటానికి కోర్టు అనుమతి ఇస్తే..అప్పుడు కవితను విచారణ వాయిదా పడుతుందా లేక యథావిధిగానే విచారణకు హాజరవుతారా అనేది ఆసక్తిగా మారింది.