
ఈ వీడియో చూస్తే ఒకడికి ఎంత అదృష్టం ఉందో.. మరోకడికి అంత దురదృష్టం ఉందని అనిపించకమానదు. భుజాలపై చేతులేసుకొని రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు స్నేహితులపై అకస్మాత్తుగా ఒక పిల్లర్ కూలింది. ఈ ఘటనలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడగా.. మరో యువకుడు స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో బుధవారం సాయంత్రం జరిగింది.
ఇద్దరు స్నేహితులు భరత్‌పూర్‌లోని సరాఫా మార్కెట్ దగ్గర రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం మూడో అంతస్థు నుంచి ఒక పిల్లర్ అకస్మాత్తుగా వీరిపై కూలిపోయింది. పిల్లర్ ఒక యువకుడి మీద అమాంతం పడింది. దాంతో ఆ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. మరో యువకుడికి మాత్రం చిన్నచిన్న గాయాలయ్యాయి. వెంటనే పాదాచారులు స్పందించి.. గాయాలపాలైన యువకుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై భరత్‌పూర్ ఎస్‌హెచ్‌ఓ రామ్‌కిషన్ యాదవ్ మాట్లాడుతూ.. ‘షాప్ యొక్క మూడవ అంతస్తు నుండి నిర్మాణంలో ఉన్న పిల్లర్ కూలిపోయింది. రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు యువకులపై పడటంతో.. ఒకరు తీవ్రంగా గాయపడగా.. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాం. మేం షాపు యజమానితో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాం. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని షాపు యజమానిపై కేసు నమోదుచేస్తాం’ అని ఆయన అన్నారు.
#WATCH | An under-construction pillar in a market in Rajasthan's Bharatpur, collapses on a pedestrian passing by from below (16.12.2020) pic.twitter.com/N4knEBRU65
— ANI (@ANI) December 17, 2020
For More News..