వెలుగు, హైదరాబాద్ : బొటానికల్ గార్డెన్లో ఆదివారం కిమ్స్ గచ్చిబౌలి ఆస్పత్రి ఆధ్వర్యంలో ‘పింక్ పిక్నిక్’ పేరుతో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వెయ్యి మందికి పైగా మహిళలు హాజరైన ఈ కార్యక్రమంలో యోగా, డైట్, సౌండ్ థెరపీ, డాన్స్, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. గుజరాత్‌కు చెందిన అయోటా సంస్థ సర్వైకల్ క్యాన్సర్ స్వీయ పరీక్ష కిట్లను పరిచయం చేసింది. రొమ్ము క్యాన్సర్ నుంచి కోలుకున్న మహిళలు తమ అనుభవాలను పంచుకున్నారు.
