దొంగను పట్టించిన పిజ్జా డెలివరీ బాయ్.. లెజెండ్ అంటున్న నెటిజన్లు

దొంగను పట్టించిన పిజ్జా డెలివరీ బాయ్.. లెజెండ్ అంటున్న నెటిజన్లు

రోడ్లపై, వీధుల్లో తిరుగుతూ ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి సడెన్ గా హీరో అయ్యాడు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా అదే నిజం. ఈ ఘటన యూఎస్ లోని పెన్సిల్వేనియాలో జరిగింది.  టైలర్ మోరెల్ అనే 29 ఏళ్ల పిజ్జా డెలివరీ వ్యక్తి  హై-స్పీడ్ ఛేజింగ్‌ చేసి, పోలీసులకు ఓ నిందితుడిని పట్టించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతను ఎలాంటి ఖర్చూ లేకుండానే హీరోగా మారిపోయాడు.

 మోరెల్ మిడిల్‌టౌన్ టౌన్‌షిప్‌లోని ఒక కస్టమర్ ఇంటికి టైలర్ పిజ్జా డెలివరీ చేయడానికి వచ్చాడు. అదే సమయంలో అకస్మాత్తుగా వీధిలో గట్టిగా గర్జిస్తూ ఓ పోలీసు టీం వచ్చింది. అంతలోనే ఓ దొంగ తప్పించుకుని పారిపోతుండడంతో పట్టుకోవడానికి పోలీసులు ట్రై చేస్తు్న్నట్టు టైలర్ గమనించాడు. అదంతా గమనిస్తోన్న టైలర్.. పరిగెత్తుకుంటూ వస్తోన్న ఆ వ్యక్తి తన దగ్గరికి రాగానే కాలితో అతన్ని ఆపేశాడు. దీంతో ఆ నిందితుడు వెంటనే అమాంతం ఎగిరి కొంచెం దూరంలో పడిపోయాడు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసి, తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత నిందితున్ని పట్టుకోవడంలో సహాయం చేసిన టైలర్ ను పోలీసులు అభినందించారు.

 దీనికి సంబంధించిన వీడియోను కోకోస్ పిజ్జా ఆస్టన్  ఫేస్ బుక్ లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోకు ఫేస్‌బుక్‌లో 277వేలకు పైగా వ్యూస్, 4.5 వేల కామెంట్లు వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు టైలర్ ను అభినందిస్తున్నారు. అతన్ని లెజెండ్ అని సంభోదిస్తున్నారు. మరొకరేమో లాల్ చాలా క్యాజువల్‌గా డేని సేవ్ చేసాడు అంటూ కామెంట్ చేశారు.  వారు పిజ్జాకి టైలర్ స్పెషల్ అని పేరు పెట్టాలని ఇంకొకరు రిప్లై ఇచ్చారు.

https://www.facebook.com/watch/?v=1580074112477713