
హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(పీజేటీఎస్‌ఏయూ)లో ఈ నెల 30న ఎన్‌ఆర్‌ఐ, ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటా, అలాగే.. పీజేటీఎస్‌ఏయూ -వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ డ్యూయల్ డిగ్రీ కోర్సుల కోసం వాక్-ఇన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జీఈసీహెచ్ విద్యాసాగర్ ప్రకటించారు. రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ఎక్జామినేషన్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ విభాగంలో ఈ కౌన్సెలింగ్ జరగనుంది.
అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు పీజేటీఎస్‌ఏయూ, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ సంయుక్తంగా అందించే బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ డ్యూయల్ డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం మరో వాక్-ఇన్ కౌన్సెలింగ్ జరుగనుంది.ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో (www.pjtsau.edu.in) సూచించిన ఫీజును తీసుకొని కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ సూచించారు.