ఆర్టీఐ విప్లవాత్మక చట్టం : ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి

ఆర్టీఐ విప్లవాత్మక చట్టం : ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్  చిన్నారెడ్డి

హైదరాబాద్ సిటీ, వెలుగు: 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం విప్లవాత్మకమైనదని విప్లవాత్మకమైన పలువురు వక్తలు పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ఆవిర్భవించి 20  ఏడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ చైర్మన్  కేశవులు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్  చిన్నారెడ్డి, జస్టిస్ చంద్రయ్య, ప్రొఫెసర్ కోదండరాం హాజరై, మాట్లాడారు.

 రాజస్తాన్​లోని ఓ గ్రామంలో తలెత్తిన సమస్య ఆధారంగా ఎన్నో పోరాటాల అనంతరం  సమాచార హక్కు చట్టం వచ్చిందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత కోసం ఈ చట్టం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఇటీవల సంచలనంగా మారిన ఎలక్ట్రోరల్ బాండ్స్ వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారానే సేకరించగలిగారని చెప్పారు.