పండుగ సీజన్.. పెరిగిన ప్లాట్ ఫాం టికెట్ల ధరలు

పండుగ సీజన్.. పెరిగిన ప్లాట్ ఫాం టికెట్ల ధరలు

సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా రైల్వేస్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరలను పెంచేసారు రైల్వే అధికారులు. ప్రస్తుతమున్న ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10 ను ఏకంగా రూ.20 కు పెంచేసారు. ఈ ధరలు  జనవరి 9(గురువారం) నుంచి జనవరి 20 వరకు అమలు కానున్నాయి. సంక్రాంతి సెలవుల రద్దీ కారణంగా సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ ఫాం టికెట్ ధర తాత్కాలికంగా పెంచుతూ సౌత్ సెంట్రల్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది . పండగ సీజన్ కావడం, రైల్వే స్టేషన్లు అన్ని ప్రయాణికులతో కిక్కిరిసిపోవడం ఖాయమని ప్లాట్ ఫాంపై రద్దీని కొంతవరకూ నియంత్రించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Platform ticket prices increased in Secunderabad, kachiguda railway stations