మ్యాచ్ లో వర్షం.. పిచ్ పై టార్పాలిన్ కప్పిన ప్లేయర్స్

మ్యాచ్ లో వర్షం.. పిచ్ పై టార్పాలిన్ కప్పిన ప్లేయర్స్

మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. విమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్ లో భాగంగా విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్ టీంల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఒక్కసారిగా వర్షం మొదలైంది. దీంతో ప్లేయర్స్ అంతా పెవిలీయన్ లోకి వెళ్లిపోయారు. గ్రౌండ్ స్టాఫ్ మాత్రం.. పిచ్ తడవకుండా టార్పాలిన్ కప్పేందుకు ప్రయత్నించారు. అయితే.. వేగంగా గాలి వీస్తుండటంతో.. అది సాధ్యం కాలేదు. దీంతో పెవిలియన్ లో ఉన్న ఇరు జట్ల ఆటగాళ్లు గ్రౌండ్ లోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. తలా ఓ పక్కన పట్టుకుని..  గ్రౌండ్ స్టాఫ్ కు సహకరించారు. పిచ్ తడవకుండా కాపాడారు. 

ఇవి కూడా చదవండి:

రైతన్న ఆగ్రహం.. వెల్లుల్లి పంటకు నిప్పు

గోల్డన్ టెంపుల్ లో యువకుడి హల్ చల్.. కొట్టి చంపిన భక్తులు