ప్రపంచకప్ ఆడటం నా కల

ప్రపంచకప్ ఆడటం నా కల

త్వరలో టీమిండియా ఆడే వరల్డ్ కప్ T20 జట్టులో భారత బౌలర్ సిరాజ్‌కు స్థానం దక్కలేదు. సీనియర్ పేస్ త్రయం బుమ్రా, షమీ, భువనేశ్వర్‌లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే ప్రపంచకప్ జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై బౌలర్ మహ్మద్ సిరాజ్ స్పందించాడు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయమని.. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పాడు.

వరల్డ్ కప్  T20 ఆడటం తన కల అని సిరాజ్ చెప్పాడు. అయితే సెలక్షన్ తన చేతిలో ఉండదు కదా అంటూ నిరాశ వ్యక్తం చేశాడు.  ఒక్కసారి జట్టులో  చోటు దక్కకపోతే కథ ముగిసినట్లు కాదని.. భవిష్యత్తులో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించడమే తన లక్ష్యమని సిరాజ్ స్పష్టం చేశాడు. తనకు దక్కే అవకాశాలను సక్రమంగా ఉపయోగించుకుని .. అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు సిరాజ్ చెప్పాడు.