రైతులకు గుడ్ న్యూస్: 21వ విడత PM కిసాన్ నిధులు విడుదల

రైతులకు గుడ్ న్యూస్: 21వ విడత PM కిసాన్ నిధులు విడుదల

చెన్నై: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పంట పెట్టుబడి సాయం కింద అందించే పీఎం కిసాన్ 21 విడత నిధులను విడుదల చేసింది. 2025, నవంబర్ 19న తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సులో ప్రధాని మోడీ బటన్ నొక్కి పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు.

పీఎం కిసాన్ 21వ విడతలో భాగంగా రూ.18,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేయగా.. దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రత్యక్ష నగదు బదిలీ పద్దతిలో నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో పీఎం కిసాన్ నిధులు జమ కానున్నాయి. 

►ALSO READ | రైలు ప్రయాణం ఇప్పుడు మరింత రుచిగా!.. రైల్వే స్టేషన్లలో మెక్‌డొనాల్డ్స్,KFC,పిజ్జా హట్ స్టాల్స్

దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో 2019, ఫిబ్రవరి 24న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) యోజన పథకం ప్రారంభించింది. ఈ స్కీములో భాగంగా దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6 వేలు అందిస్తోంది. ఏడాదిలో మూడుసార్లు రూ.2వేల చొప్పున మూడు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తోంది. 

లబ్ధిదారుని స్థితిని ఎలా తనిఖీ చేయాలి..?

  • PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌https://pmkisan.gov.in. ను సందర్శించాలి. 
  • హోం పేజీలో Beneficiary Status పై క్లిక్ చేయాలి. మీ వివరాలు నమోదు చేయాలి. 
  • మీ ఆధార్ నంబర్, బ్యాంక్ , ఖాతానంబర్ లేదా మొబైల్ నంబర్ సబ్మిట్ చేయాలి.మీ స్టేటస్ కనిపిస్తుంది.

PM కిసాన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి..?

  • కొత్త రైతులు PM కిసాన్ కోసం ఆన్‌లైన్‌లో లేదా కామన్ సర్వీస్ సెంటర్ల (CSCలు) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేసుకోవాలో ఇక్కడ ఉంది.
  • అధికారిక PM కిసాన్ వెబ్‌సైట్‌https://pmkisan.gov.in.లోకి వెళ్లాలి. 
  • New Farmer Registration పై క్లిక్ చేయాలి. 
  • ఆధార్ నంబర్, రాష్ట్రం, జిల్లా, వ్యక్తిగత బ్యాంక్ సమాచారం వివరాలు సబ్మిట్ చేయాలి. 
  • ఫారం సమర్పించి ఓ కాపినీ సేవ్ చేసుకోవాలి. 
  • సమర్పించిన తర్వాత, అప్లికేషన్ ఆమోదానికి ముందు స్థానిక అధికారులచే ధృవీకరించబడుతుంది.