విద్వేషాలు రెచ్చగొట్టి గెలవలేరు: మోడీ

విద్వేషాలు రెచ్చగొట్టి  గెలవలేరు: మోడీ

‘‘కాశ్మీర్​లో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు, అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారు ఎన్నటికీ గెలవలేరు. ఎందుకంటే బాంబులు, బుల్లెట్ల కన్నా ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు బలమెక్కువ” అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రతినెల చివరి ఆదివారంలో నిర్వహించే ‘మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీ బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ కార్యక్రమంలో ఆయన తన సందేశాన్ని ప్రజలకు వినిపించారు. ‘‘గత జూన్​లో జమ్మూకాశ్మీర్​లో ‘బ్యాక్ టు విలేజ్’ పేరుతో ఓ ప్రోగ్రామ్ నిర్వహించాం. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్థానికులతో చర్చించేందుకు ప్రభుత్వ అధికారులు అక్కడికి వెళ్లారు. దానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. చాలా సెన్సిటివ్, రిమోట్ ఏరియాల్లోని ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్​లో పాల్గొనేందుకు ప్రజలు ఎంత ఆసక్తి చూపుతున్నారో చెప్పేందుకు ఇదే నిదర్శనం.

తమ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని, మంచి పాలన కావాలని వారు కోరుకుంటున్నారు. బాంబులు, బుల్లెట్ల కన్నా.. అభివృద్ధికి బలమెక్కువ అనే విషయం స్పష్టమవుతోంది” అని ఆయన అన్నారు. దాదాపు 4,500 పంచాయతీలకు అధికారులు వెళ్లారని చెప్పారు. ‘‘ఎప్పుడూ ఎదురుకాల్పులు జరుగుతూ ఉండే సరిహద్దు గ్రామాలకు కూడా అధికారులు వెళ్లారు. అత్యంత సెన్సిటివ్ ప్రాంతాలైన షోపియాన్, పుల్వామా, కుల్గామ్, అనంత్​నాగ్ జిల్లాల్లో పర్యటించారు” అని వివరించారు.

చంద్రయాన్-2.. తెగువ నేర్పింది

చంద్రయాన్-2 మిషన్ నుంచి నమ్మకం, తెగువ అనే రెండు పాఠాలను తాను నేర్చుకున్నానని మోడీ అన్నారు. చంద్రయాన్–2 ప్రయోగం సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తడం, దీని వల్ల మిషన్ లాంచింగ్​ వాయిదా పడటం, ఇలాంటి పరిస్థితుల్లో సమస్యను సైంటిస్టులు పరిష్కరించిన తీరు.. నిజంగా ఆదర్శనీయం, అసమానం, అపూర్వమని ప్రశంసించారు. ‘‘చంద్రయాన్-2.. గుండె, ఆత్మ  రెండూ ఇండియానే. ఎందుకంటే ఇది పూర్తి స్వదేశీ మిషన్. ఇండియాలో రూపుదిద్దుకున్న మిషన్’’ అని చెప్పారు. యువకులు, పిల్లల్లో చంద్రయాన్ స్ఫూర్తి నింపుతుందన్నారు. మన సైంటిస్టులు ‘ది బెస్ట్’, వరల్డ్ క్లాస్ అని అన్నారు.