
గుజరాత్ తీరం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోడీ అన్నారు. గుజరాత్ లో ఓడ రేవులు దేశ ప్రగతికి గేట్ వేలుగా మారాయని చెప్పారు. బీజేపీ హయాంలోనే గుజరాత్ అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు. ఎడారిగా ఉన్న కచ్ ప్రాంతం రూపు రేఖలు మార్చామని, గుజరాత్ వెరవల్ లో జరిగిన సభలో ప్రధాని మోడీ మాట్లాడారు.
వెరవల్ సభ కంటే ముందు ప్రధాని మోడీ ద్వాదశ జ్యోతిర్లింగాలలోని మొదటిదైన సౌరాష్ట్రలోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. శివలింగానికి ఆయన అభిషేకం చేశారు. సోమనాథ్ ఆలయ సందర్శనకు వచ్చిన మోడీకి గుజరాత్ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.