‘డియర్ యూత్.. మోడీ,షా లు మీ భవిష్యత్తును నాశనం చేశారు’

‘డియర్ యూత్.. మోడీ,షా లు మీ భవిష్యత్తును నాశనం చేశారు’

CAA, NRC పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ దేశ యువతకు ట్విట్టర్ వేదికగా కీలక సందేశమిచ్చారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.  మోడీ, అమిత్ షా యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం అంశాలపై యువత కోపాన్ని ఎదుర్కొనలేకే  విద్వేష, విభజన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే నిరసన తెలిపే క్రమంలో హింసకు పాల్పడొద్దని, ప్రేమతోనే వారిని ఓడించాలని రాహుల్ పిలుపునిచ్చారు.