యువత భవిష్యత్కు టాప్ ప్రయారిటీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

యువత భవిష్యత్కు టాప్ ప్రయారిటీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
  •     కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 
  •     పేపర్ లీకేజీ బాధ్యులపై 
  • కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి​


న్యూఢిల్లీ: దేశ యువత సంక్షేమం, వారి ఉజ్వల భవిష్యత్​కు మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు 'ఫాస్ట్ ట్రాక్ కోర్టులు' ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం యువత పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని గురువారం 'ఎక్స్' వేదికగా ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం విద్యావ్యవస్థలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.

అంతకుముందు ప్రధాని మోదీ స్పందిస్తూ.. యువత భవిష్యత్​తో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని హెచ్చరించారు. విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకు వేగవంతమైన విచారణ జరిపి, దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇటీవల 'నీట్' పరీక్ష అక్రమాలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన 'సంసద్ చలో' మార్చ్ ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను అడ్డుకునే క్రమంలో జరిగిన లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగంలో పలువురు విద్యార్థులు, పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షా స్పందిస్తూ విద్యార్థులకు భరోసా ఇచ్చారు.