దక్షిణాదిలో తొలి వందే భారత్ రైలును ప్రారంభించిన మోడీ

దక్షిణాదిలో తొలి వందే భారత్ రైలును ప్రారంభించిన మోడీ

దక్షిణాదిలో తొలిసారిగా చెన్నై-మైసూరు మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్ లో  ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. వందే భారత్ రైలు ఇండస్ట్రీరియల్ హబ్  అయిన చెన్నై, బెంగళూరులోని టెక్ స్టార్టప్ హబ్, ప్రసిద్ధ పర్యాటక నగరం మైసూరు మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని పీఎంవో తెలిపింది. 

బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ లో భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. కర్ణాటక ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ కలిసి కర్నాటక నుంచి కాశీకి యాత్రికులను పంపించేందుకు భారత్ గౌరవ్ పథకం కింద ఈ రైలును తీసుకువచ్చింది. కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్ లను సందర్శించడానికి యాత్రికులకు సౌకర్యవంతంగా ఉండేలా దీన్ని రూపొందించారు. అంతకు ముందు బెంగళూరులోని విధాన సౌధలో కవి కనకదాసు, మహర్షి వాల్మీకి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రధాని మోడీ.