పీఎంఏవై ఇండ్లు ప్రారంభిస్తూ ప్రధాని మోదీ భావోద్వేగం

పీఎంఏవై ఇండ్లు ప్రారంభిస్తూ ప్రధాని మోదీ భావోద్వేగం
  • షోలాపూర్​లో 90 వేల పీఎంఏవై ఇండ్లు పంపిణీ
  • 2014లో తానిచ్చిన హామీని నెరవేర్చానని వెల్లడి
  • మహారాష్ట్రలోని షోలాపూర్​లో 90 వేల ఇండ్లు పంపిణీ
  • 2014లో తానిచ్చిన హామీని నెరవేర్చానని వెల్లడి
  • ప్రజల ఆశీర్వాదమే తన అతిపెద్ద ఆస్తి అని ప్రధాని కామెంట్

షోలాపూర్: పేదలకు ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇండ్లను చూసిన తర్వాత.. చిన్నప్పుడు తనకూ ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండేదని అనిపించిందని గద్గద స్వరంతో అన్నారు. ‘‘పీఎంఏవై కింద నిర్మించిన దేశంలోనే అతిపెద్ద హౌసింగ్ సొసైటీని ఈ రోజు ప్రారంభించాం. నేను 2014లో ఇచ్చిన హామీని నెరవేర్చా. ఇప్పుడు దాన్ని చూడటానికి రావడం ఎంతో సంతృప్తినిచ్చే విషయం. నేను ఈ ప్రాజెక్టును పరిశీలించినప్పుడు.. నా చిన్నతనంలో నేను కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తే బాగుండేదని ఆలోచించా’’ అంటూ ఎమోషనల్ అయ్యారు. శుక్రవారం మహారాష్ట్రలోని షోలాపూర్‌‌‌‌లో పర్యటించిన ప్రధాని.. రూ.2 వేల కోట్ల విలువైన 8 అమృత్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. పీఎంఏవై అర్బన్ కింద నిర్మించిన 90 వేల ఇండ్లను పేదలకు అందజేశారు. షోలాపూర్‌‌‌‌లోని రాయ్‌‌నగర్ హౌసింగ్ సొసైటీలో హ్యాండ్లూమ్ వర్కర్లు, వెండార్లు, పవర్ లూమ్ వర్కర్లు, బీడీ వర్కర్లు, డ్రైవర్ల కోసం నిర్మించిన 15 వేల ఇండ్లను పంపిణీ చేశారు. పీఎం స్వనిధి కింద 10 వేల మంది లబ్ధిదారులకు తొలి, రెండో వాయిదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. ప్రజల కలలు నెరవేరినప్పుడు ఎంతో సంతోషం కలుగుతుందని, వారి ఆశీర్వాదమే తన అతిపెద్ద ఆస్తి అని మోదీ అన్నారు.

ఇది మోదీ గ్యారంటీ

శ్రీరాముడి స్ఫూర్తితో తమ ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. 22న దేశవ్యాప్తంగా రామ జ్యోతిని వెలిగించాలని పిలుపునిచ్చారు. పేదల జీవితాల నుంచి పేదరికాన్ని తొలగించడానికి ఇది ఒక ప్రేరణగా ఉంటుందని చెప్పారు. ‘రాముడు తన ప్రజలను సంతోషపెట్టే పనిచేశాడు. పేదల సంక్షేమం, సాధికారత కోసం నా ప్రభుత్వం అంకితమైంది. వారి కష్టాలను తగ్గించేందుకు మేము పథకాలను ప్రారంభించాం. మా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో దళారుల పాత్రను పూర్తిగా నిర్మూలించినం’ అని తెలిపారు.

‘బోయింగ్’ సెంటర్ ప్రారంభం

బోయింగ్‌‌కు చెందిన కొత్త గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ క్యాంపస్‌‌ను బెంగళూరులోని దేవణహళ్లిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్​ను 43 ఎకరాలలో రూ.1,600 కోట్లతో నిర్మించామని, అమెరికా బయట ఇదే అతి పెద్ద పెట్టుబడి అని బోయింగ్ తెలిపింది. తర్వాతి తరం ప్రొడక్టుల తయారీకి, డిఫెన్స్ ఇండస్ట్రీకి సర్వీస్​అందించేం దుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పింది.