కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

 కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

 ఆమ్ ఆద్మీ పార్టీ  జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు...మీరు జీవితాతం ఆరోగ్యంతో జీవించాలని ప్రార్థిస్తున్నా అని  మోదీ ట్వీట్ చేశారు.  2023 ఆగస్టు 16న కేజ్రీవాల్‌ 55వ ఏట అడుగుపెట్టారు. 

 అరవింద్ కేజ్రీవాల్ 1968 ఆగస్టు 16న హర్యానాలోని భివానీ జిల్లాలో జన్మించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిచి సీఎం అయ్యారు.  గత 8 ఏళ్లుగా ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కంటే ముందు కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ మూడుసార్లు ఢిల్లీ సీఎంగా ఉన్నారు.  

పలువురు ఆప్ మద్దతుదారులు, ప్రముఖ రాజకీయ నాయకులు కూడా సోషల్ మీడియాలో కేజ్రీవాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.