సభలో ఉండని వ్యక్తి గురించి ఏం మాట్లాడను?

సభలో ఉండని వ్యక్తి గురించి ఏం మాట్లాడను?

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై మరోసారి విమర్శలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఏఎన్ఐకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో మాట్లాడుతూ...వినని.. సభలో కూర్చొని వ్యక్తి గురించి ఏం మాట్లాడాలి అంటూ ప్రశ్నించారు. భారత్‌-చైనా సరిహద్దు వివాదం, నిరుద్యోగం పెరగడం వంటి అంశాలపై స్పష్టత ఇవ్వనందుకు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ వేసిన ప్రశ్నలకు సమాధానం ఎందుకు ఇవ్వలేదని మోడీని ప్రశ్నించారు.  రాహుల్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆయనపై ఎదురు దాడి చేశారని అన్న వ్యాఖ్యలపై మోడీ తీవ్రంగా స్పందించారు. మాటలతో దాడి చేయడం అనేది తమకు తెలియని విషయం అన్నారు. పరుష పదజాలంతో మాట్లాడటం తనకు తెలియదన్నారు. అది తన నైజం కూడా కాదన్నారు. మీడియాలో హెడ్ లైన్ల కోసం మేం ఎలాంటి వ్యాఖ్యలు చేయమన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. రాహుల్ అడిగిన ప్రశ్నలకు ఆయా మంత్రిత్వ శాఖలు సవివరమైన సమాధానాలు ఇచ్చాయని అన్నారు. అవసరమైన చోట తాను కూడా సమాధానం ఇచ్చామన్నారు. 

ANI కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, ప్రధాని మాట్లాడుతూ..  కాంగ్రెస్ మాజీ చీఫ్‌ను లక్ష్యంగా చేసుకుని, " ఏది వినని.. సభలో కూర్చోని వ్యక్తికి తాను ఏం సమాధానం ఇవ్వాలన్నారు. పార్లమెంట్‌లో చర్చను స్వాగతిస్తున్నట్లు నొక్కిచెప్పిన ప్రధాని మోదీ, తాను, తన ప్రభుత్వం ఎవరిపైనా దాడి చేయడం లేదన్నారు. చర్చలపై తనకు నమ్మకముందన్నారు.  సభలో తాను ఏదైనా మాట్లాడితో అది మీడియాకు గరం మసాలాలా మారొచ్చని ఆయన అన్నారు.  ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభ, రాజ్యసభల్లో తన ప్రసంగాల సందర్భంగా నిరుద్యోగం, భారత్-చైనా సమస్యలపై రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారని కాంగ్రెస్ ఆరోపణలపై ప్రశ్నకు ప్రధాని సమాధానమిచ్చారు.

మేం ఎవరిపై దాడి చేయమన్నారు. దాడికి బదులు చర్చలు జరపడానికే తాము ఇష్టపడతామన్నారు. ప్రతి అంశంపై వాస్తవాలను తెలిపామన్నారు. ప్రతి అంశంపై వాస్తవాల ఆధారంగా మాట్లాడమన్నారు. కొన్ని విషయాలపై, మా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ వివరణాత్మక సమాధానాలు ఇచ్చారని తెలిపారు మోడీ. అంతకుముందు, రాహుల్ గాంధీ పార్లమెంటులో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన బలమైన దాడిపై స్పందించారు బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం "కాంగ్రెస్‌కు భయపడుతోంది" అని రాహుల్ అన్నారు. ప్రధానికి కాంగ్రెస్ అంటే ఉన్న భయం పార్లమెంట్‌లో కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడంపైనే దృష్టి సారించారని, బీజేపీ చేసిన వాగ్దానాల గురించి మాట్లాడడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు.