డిఫెన్స్ ఎక్స్ పో కొత్త ప్రారంభానికి ప్రతీక: మోడీ

డిఫెన్స్ ఎక్స్ పో కొత్త ప్రారంభానికి ప్రతీక: మోడీ

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ గాంధీనగర్ లో డిఫెన్స్ ఎక్స్ పో 2022ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశగొప్ప చిత్రం ఆవిష్కృతం అయ్యిందని ప్రధాని మోడీ అన్నారు. ఇందులో యువత సామర్థ్యం, దేశాభివృద్ధి ఉందన్నారు. మొత్తం 43 ఆఫ్రికన్ దేశాలు తమతో కలిసివచ్చాయని మోడీ చెప్పారు. దేశం చాలా ముందుకు వచ్చిందన్న ఆయన... ఇంతకు ముందు పావురాలను విడిచిపెట్టాం.. ఇప్పుడు చిరుతలను వదులుతున్నామని చెప్పారు. అలాగే.. దిగుమతి కోసం నిషేధించబడే 101 వస్తువుల జాబితాను విడుదల చేయడానికి రక్షణ దళాలు సన్నాహాలు చేశాయని మోడీ తెలిపారు. 

మొట్టమొదటిసారి భారత నేలపై రక్షణ ఆయుధాలు తయారయ్యాయని మోడీ తెలిపారు. మన దేశ కంపెనీలు, శాస్త్రవేత్తలు, యువత శక్తి, సర్ధార్ పటేల్ గడ్డ నుంచి ఈరోజు మన సత్తా ప్రపంచానికి చాటి చెబుతున్నామని పేర్కొన్నారు. ఇక్కడ తొలిసారిగా 450కి పైగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరుగుతున్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉత్తర గుజరాత్ లోని దీసాలో కొత్త ఎయిర్ బేస్ కు కూడా శంకుస్థాపన చేశారు.